నటి కియారా అద్వానీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 2014లో వచ్చిన ఫగ్లీ అనే హిందీ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది నటి కియారా అద్వానీ. హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. మహేష్‌బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది, అయితే తర్వాత మరే సినిమాలో ఈ భామ నటించలేదు. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిందీ బ్యూటీ. కియారా అద్వానీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి జూన్ 13తో 7 ఏళ్లు గడిచాయి. ఈ సమయంలో ఓ ట్విట్టర్ యూజర్ ఆమెని ఓ ప్రశ్న అడిగాడు.
మీరు మళ్లీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగాడు.కచ్చితంగా మరో తెలుగు సినిమాను చేస్తా అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సమాధానం తర్వాత చాలా మంది ఓ ఆలోచన చేస్తున్నారు. ఆమె ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ.
Done? https://t.co/2aBLLfiQFn
— Kiara Advani (@advani_kiara) June 13, 2021