ముగిసిన ఘట్టమనేని ఇందిరాదేవి అంత్యక్రియలు

0
135

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణ సతీమణి, హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా కృష్ణ, ఇందిరా మొదటి భార్య కాగా వీరికి ఐదుగురు సంతానం. హీరో మహెహ్ బాబు, రమేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఘట్టమనేని ఇందిరాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇక ఇందిరాదేవి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. సాంప్రదాయ పద్దతిలో మహేష్ బాబు తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. తన అభిమాన హీరో తల్లిని కడసారి చూడడానికి అభిమానులు తరలివచ్చారు.