పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తు్న్న ప్రతిష్టా్త్మక చిత్రం ఓజీ(OG). దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం నుంచి పవన్ కల్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఎగ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ టీజర్ వీడియో కోలీవుడ్ యంగ్ యాక్టర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో రాబోతుందట. సింహం గర్జించినట్లుగా ఉండే అతడి గొంతుతో పవన్ కల్యాణ్‌ను ఎలివేట్ చేయడం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ గ్లింప్స్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా చేస్తుండగా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం(OG).. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.