సాయిపల్లవి త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందా? ఇందులో వాస్తవమెంత..

0
123

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఫిదా సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఈ సినిమాలో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసింది. ఆ సినిమా అనంతరం వరుస ఆఫర్లతో ఫుల్ బిజిగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సాయి పల్లవి తెలుగులో నటించిన చివరి సినిమా విరాటపర్వం అనంతరం ఒక్క సినిమా చేయడానికి కూడా కమిట్ కావట్లేదని సాయి పల్లవి ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెళ్లి పీటలెక్కపోతుందని అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సాయి పల్లవికి అప్పుడే పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లితండ్రుల బలవంతంతో ఒకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ బంధువుల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిన్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సాయిపల్లవి సన్నిహతులు చెబుతున్నారు. మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈవార్త ఎంత వరకు వాస్తవమో..