రణ్‌బీర్ విలన్‌గా సూర్య?

-

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ అప్‌కమింగ్ సినిమాలో తమిళ హీరో సూర్య.. విలన్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ సహా దక్షిణాది సినీ పరిశ్రమ అంతటా ఇదే హాట్ టాపిక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ కాంబో వస్తే సూర్య తాకిడికి రణ్‌బీర్ తట్టుకోగలడా అని కూడా అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా వీరు కనిపించే సినిమా కూడా అందరి దృష్టిని తెగ ఆకట్టుకుంటుంది. అదే బాలీవుడ్‌ ది సక్సెఫుల్ ఫ్రాంఛైజీగా పేరొందిన ‘ధూమ్’. ధూమ్ సినిమా అంటేనే దానిపై చాలా స్పెషల్ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు మేకర్స్ ‘ధూమ్ 4’ తీయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటికే ‘ధూమ్ 4’కు సన్నాహాలు జరుగుతున్నాయని బాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రణ్‌బీర్( Ranbir Kapoor), సూర్య(Surya) పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ధూమ్ ఫ్రాంఛైజీ ప్రతి భాగానికి కథ అందించి నిర్మించిన ఆకాష్ చోప్రా ఇప్పటికే ‘ధూమ్4(Dhoom 4)’ స్క్రిప్ట్‌ను కూడా ఫైనల్ చేసేశాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ధూమ్4’లో హీరోగా రణ్‌బీర్‌ నటిస్తే బాగుంటుందని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ అంశంపై రణ్‌బీర్‌తో చర్చలు కూడా చేసేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమాపై రణ్‌బీర్ కూడా మాంచి ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. కాగా ‘ధూమ్4’లో రణ్‌బీర్‌ను ఢీకొట్టే పాత్రలో తమిళ స్టార్ సూర్య నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎవరి నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరి అతి త్వరలోనే ఏమైనా అనౌన్స్‌మెంట్స్ వస్తాయేమో చూడాలి. అయితే మరోవైపు షారుఖ్ ఖాన్, ప్రభాస్ పేర్లు కూడా ‘ధూమ్4’ క్యాస్టింగ్‌లో వినిపిస్తున్నాయి. మరి చూడాలి. ‘దూమ్4(Dhoom 4)’తో ఏ హీరోలు దుమ్ము దులుపుతారో.

Read Also: నేను ప్రభాస్‌ని అనలేదు: అర్షద్ వార్సీ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...