‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?

Is the 'Akhanda' pre-release event there?

0
116

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. మోతుబరి రైతుగా .. అఘోరగా ఆయన ఈ సినిమాలో అభిమానులను అలరించనున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ప్రగ్యా  జైస్వాల్ సందడి చేయనుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. మరో కీలకమైన పాత్రను జగపతిబాబు పోషించాడు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో ఈ వేడుక నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 27న గానీ 28న గాని ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.