ఆనాడు పెళ్లి సందడిని శ్రీకాంత్ తో తీశారు రాఘవేంద్రరావు ఇప్పుడు మళ్లీ ఆయన కుమారుడు రోషన్ తో పెళ్లి సందడి చేయబోతున్నారు..ఈ చిత్రానికి నాటి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆనాడు సంగీతం ఇచ్చిన కీరవాణి ఇప్పుడు కూడా ఇస్తున్నారు, అందుకే ఈ మాస్టర్ కలయిక సూపర్ హిట్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు, అయితే హీరోయిన్ ఎవరు అని అనేక వార్తలు పేర్లు వినిపించాయి, తాజాగా ఎవరో క్లారిటీ వచ్చింది.మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త కథానాయికను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు.
మొత్తానికి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది, ఇక ఈ పెళ్లి సందడి చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.