RRR నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనా?

Is this the Big Surprise from RRR?

0
99

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అక్టోబర్​ 29న ఓ బిగ్​ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నట్లు ఇటీవలే ప్రకటించింది ‘ఆర్​ఆర్​ఆర్’​ చిత్రబృందం​. ఇప్పుడా బిగ్​ అప్డేట్​ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్​ఆర్​ఆర్​’ను ఇంగ్లీష్​ వెర్షన్​లో రిలీజ్​ చేసేందుకు ప్రముఖ హాలీవుడ్​ నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్ ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న టీమ్​తో చర్చలు కూడా జరిపిందట. ఈ డీల్​ ఓకే అయినట్లు సమాచారం. ఈ విషయాన్నే అక్టోబర్​ 29న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.