‘వారసుడు’లో విజయ్ పాత్ర ఇదేనా?

0
104

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న తాజా మూవీ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, శరత్ కుమార్, శ్రీకాంత్, జయసుధ, ప్రభు, ప్రకాశ్ రాజ్, యోగి బాబు, సంగీతా, సంయుక్తా వంటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. దీనితో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ పాత్ర రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో విజయ్ కాలేజీ కుర్రాడిగా, ఆ తరువాత ప్రెజెంట్ సీన్స్‌లో ఓ ఫుడ్ కంపెనీ బాస్‌గా విజయ్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో విజయ్ తనదైన వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.