మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఈ మాట మన చిత్ర సీమలో ఇటీవల వినిపిస్తోంది, అయితే బీ టౌన్ మీడియాలో కూడా వినిపిస్తుంది..చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ వివాహం గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు, ఇక అతని అభిమానులు కూడా ఎప్పుడు గుడ్ న్యూస్ వినిపిస్తాడా అని వెయిటింగ్.
అయితే తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. ఈ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ , తన ప్రేమికురాలు అలియా భట్ అని తేల్చి చెప్పేశాడు. ఇక త్వరలో తాము వివాహం చేసుకుంటాము అని తెలిపాడు, కరోనా మహమ్మారి కారణంగా తమ వివాహం వాయిదా పడిందని లేకపోతే ఈ ఏడాది అయిపోయేది అని క్లారిటీ ఇచ్చాడు.
ఒక ఇంటర్వ్యూలో రణ్ బీర్ తమ పెళ్లి కబురును తాజాగా క్లియర్ గా చెప్పాడు, దీంతో ఇద్దరి అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు… బీ టౌన్ లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది.రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా బ్రహ్మాస్త్ర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.