ఐటం సాంగులే బెటర్ అంటున్న హీరోయిన్…

ఐటం సాంగులే బెటర్ అంటున్న హీరోయిన్...

0
124

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్నిరోజులకే ఐటం సాంగులకు పరిమితం అయింది హంసనందిని… మహారాష్ట్రలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం కన్నడలో నటిస్తోంది అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు…

వీరు ఇంటికి పరిమితం అయినా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నారు.. హంస కూడా తన అభిమానులకు సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంది.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది… తాజాగా అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ…

హీరోయిన్ గా తనకు అన్ని రొటీన్ పాత్రలే వచ్చాయని తనకు ఆ పాత్రలు నచ్చకపోవడంతో ఐటం సాంగ్ వైపు మళ్లానని చెప్పింది… ప్రధాన్యతలేని హీరోన్ పాత్ర కంటే ఐటం సాంగులే బెటర్ అని చెప్పింది… స్పెషల్ సాంగ్స్ రొటీన్ కు బిన్నంగా ఉంటాయని చెప్పింది హంసనందిని…