నటుడు అల్లరినరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది కథానాయిక. ఆదివాసీల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనిని జీ స్టూడియోస్, హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘ఇవన్నీ ఆదివాసీల గ్రామాలు. వీళ్లలో ఎక్కువమంది జీవితంలో ఓటు వేయని వాళ్లే ఎక్కువ’, ‘సాయం చేస్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు.. మీరు మనుషులు అయితే సాయం చేయండి’ ’90 కిలోమీటర్ల మేర అడవి, 150 కిలోమీటర్ల చుట్టుకొలత.. అక్కడికి వెలితే ఎవరూ వెనక్కి తిరిగి రారు’, ’25 కిలోమీటర్లు అవతలికి వస్తే గానీ.. వీళ్లెలా బతుకున్నారో మనకే తెలియలేదు. వీళ్లని చూస్తే జాలి పడాలో బాధపడాలో తెలియట్లేదు’ అంటూ సంభాషణలతో సాగే ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఈ టీజర్ లో మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా అడవుల మధ్యలో బతుకుతూ ఉంటుంది. అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు అన్నట్టు చూపించారు. ఈ మూవీ తర్వాత.. నాంది సినిమాతో తనకు సూపర్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో తన 60వ చిత్రం చేయనున్నారు.
టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=T6Rd0vhJfPs&feature=emb_title