పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తోన్న ప్రతిష్టాత్మ చిత్రం బ్రో. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్నాడు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సిత్తం సినిమా రీమేక్‌గా బ్రో వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సెకండ్ సాంగ్(Jaanavule Song) రిలీజ్ చేశారు. ఈ పాటలో సాయితేజ్ సరసన కేతిక శర్మ నటించింది. అయితే, ఈ పాట యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. 24 గంటలు కూడా గడవక ముందే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెడింగ్‌లోనూ కొనసాగుతోంది. కాగా, జులై 28న బ్రో సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Jaanavule Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘బ్రో’ సెకండ్ సాంగ్
-