జబర్దస్త్ జడ్జిగా మా నరేష్

జబర్దస్త్ జడ్జిగా మా నరేష్)

0
83

జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే.. అయితే నాగబాబు మాత్రం జీ తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి నాగబాబు నిజంగా జబర్దస్త్ కు పిల్లర్ గా ఉండేవారు అనే చెప్పాలి, ఇప్పుడు ఆయన బయటకు వెళ్లడంతో టీఆర్పీలు ఎలా ఉంటాయా అనేదానిపై అందరూ వెయిట్ చేస్తున్నారు.. అంతేకాదు మల్లెమాల వారికి ఆ పోస్టుని ఎవరి ద్వారా భర్తీ చేయాలి అనే డౌట్ కూడా పెరిగిపోయింది.

ఇప్పటికే సాయి కుమార్.. బండ్ల గణేష్ నుండి మొదలుకుని చాలా మందితో మల్లెమాల వారు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మా ప్రెసిడెంట్.. సీనియర్ సినిమా హీరో నటుడు నరేష్ జబర్దస్త్ జడ్జ్ సీట్ పై ఆసక్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు .తాజాగా నరేష్ ఓ యూ ట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ జబర్దస్త్ అంటే తనకు ఇష్టం అని అన్నారు. ఒక వేళ తనని జడ్జ్ గా వ్యవహరించమని అడిగినా, అలాంటి అవకాశం వచ్చినా తప్పకుండా ఆలోచిస్తానని జబర్దస్త్ జడ్జ్ స్థానం పై ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పాడు. దీంతో ఇప్పుడు మల్లెమాల వారు నరేష్ తో సంప్రదింపులు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.