జబర్ధస్త్ కమెడియన్స్ కు బోయపాటి బంపర్ ఆఫర్

జబర్ధస్త్ కమెడియన్స్ కు బోయపాటి బంపర్ ఆఫర్

0
42

బాలయ్య బాబు సినిమాలో కమెడియన్లు అంటే ఎప్పుడూ ఏ సినిమా చూసినా సీనియర్లు ఉంటారు, జూనియర్లకు చాలా తక్కువ అవకాశం ఇస్తారు.. కాని ప్రస్తుతం కొత్తగా బాలయ్య బోయపాటి కాంబో చిత్రంలో మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న కమెడియన్లను తీసుకోవాలి అని చూస్తున్నారట..

అందుకే ఈ సినిమాలో కామెడీకి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం, జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి వున్నాడని టాక్ నడుస్తోంది.ఇక నాలుగు నెల్లలో ఈ సినిమా పూర్తి చేసి విడుదల చేయాలి అని చూస్తున్నారు. అయితే అలీ బ్రహ్మనందం కూడా ఇందులో కమెడియన్లుగా చేస్తున్నారట.

మరికొందరు జబర్దస్త్ కమెడియన్లను తీసుకోవాలి అని చూస్తున్నారు బోయపాటి, .జబర్దస్త్ కు ఇబ్బంది లేకుండా వారికి అవకాశం ఇస్తారట, ఇప్పటికే నలుగురు టీమ్ సభ్యులతో బోయపాటి మాట్లాడినట్లు తెలుస్తోంది.. ఇక జబర్ధస్త్ నుంచి బయటకు వెళ్లిన వారికి కూడా అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి.. మరి బోయపాటి ఎవరికి అవకాశం ఇస్తారు అనేది తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడాల్సందే.