తన ఆస్తి కోసం సొంత మేనమామ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడంటూ కన్నడ సినీ నటి జయశ్రీ రామయ్య ఆరోపించింది. సి కె అచ్చి కట్టే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను సంపాదించిన ఆస్తి గురించి మేనమామ గిరీష్ ఎన్నో రోజులుగా తన తల్లిని, తనను వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
ఈనెల పదవ తారీఖున హనుమంత్ నగర్ లోని తన నివాసానికి వచ్చి తన తల్లినీ ఇంటి నుంచి గెంటి వేశాడు. అని తన ధరిస్తున్న దుస్తులు అసభ్యంగా ఉన్నాయని తీవ్రమైన పదజాలంతో దూషించారని తెలిపింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు గిరీష్ ను విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇద్దరిని విచారించిన తర్వాతే కేసు నమోదు పై ఓ నిర్ణయం తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి తెలిపారు.