కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై వస్తున్న అత్యాచార ఆరోపణలు కాస్తా తెలంగాణ మహిళా కమిషన్‌కు చేరాయి. ఈ వ్యవహారంపై వెంటనే దృష్టి సారించి యాక్షన్ తీసుకోవాలని కోరుతూ.. మహిళా కమిషన్‌ను కోరింది సదరు బాధితురాలు. తనకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ బాధితురాల డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసింది. తనకు జానీ మాస్టర్‌కు 2017 నుంచి పరిచయం ఉందని, 2019లో తాను ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరానని బాధితురాలు తెలిపింది. జాయిన్ అయిన కొంతకాలానికే తనను దూషించడం, కొట్టడం కూడా చేసేవాడంటూ బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తనపై లైంగిక వేధింపులకు పాల్పడం చేశాడని, ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా చేస్తానంటూ తన అధికార బలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని సదరు బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది.
ఒకానొక సమయంలో ముంబైలో షూటింగ్ అని చెప్పి ఇద్దరు పురుషు అసిస్టెంట్లతో కలిసి తనను కూడా జానీ మాస్టర్(Jani Master) తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లిన తర్వాత హోటల్ రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని సదరు యువతి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత మణికొండ ఫ్లాట్లో అనేకసార్లు బలవంతం చేశాడని, అయినా లొంగకపోవడంతో ఎన్నో రకాల బెదిరిపుంలకు పాల్పడ్డాడని ఆరోపించింది. తనను మతం మార్చుకోమని భయపెట్టాడని, బెదిరించాడని, మతం మార్చుకుని పెళ్ళి చేసుకుందామని కూడా అన్నాడని సదరు కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. కాగా మహిళా కమిషన్ ఆమె ఫిర్యాదును స్వీకరించింది.