జెన్నిఫర్ నోటా పవన్ కల్యాణ్ పాట..!!

జెన్నిఫర్ నోటా పవన్ కల్యాణ్ పాట..!!

0
83

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆశించినంత విజయం సాధించక పోయినప్పటికీ , అందులోని పాటలు చాలా హిట్టేనని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా లోని పాలు శ్రోతలను ఉర్రుతలూగించాయి.. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే యువత కి విపరీతంగా నచ్చేసింది.. సినిమా ఫలితం ఏమైనా దేవి, పవన్ కాంబోలో ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు..

తాజాగా ఈ సినిమాలోని ఓ పాట హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ను సైతం ముగ్ధురాలిని చేసింది.ఓ అంతర్జాతీయ చానల్ లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో జెన్నిఫర్ లోపెజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన ‘ద కింగ్స్’ అనే గ్రూప్ ఫినాలే షో ‘ద కింగ్స్’ సర్దార్ గబ్బర్ సింగ్ లోని ‘వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా’ అనే పాటకు డాన్స్ చేశారు. పాటలో ‘ద కింగ్స్’ బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ ఉద్వేగం పట్టలేకపోయారు. తన సీట్లోంచి పైకి లేచి మరీ చప్పట్లు కొడుతు పాటను పాడారు.