జగన్ పై జాతీయ మీడియా కథనం

జగన్ పై జాతీయ మీడియా కథనం

0
69

దేశ వ్యాప్తంగా జగన్ గెలుస్తాడు అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. మరో పక్క జగన్ కు పెద్ద ఎత్తున ప్రజా అభిమానం వచ్చింది అని, అందుకే ఈసారి మహిళా ఓటర్లు కూడా ఫ్యాన్ కు ఓటు వేశారు అని చెబుతున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీకి ఏపీలో కొన్ని మీడియాలు మినహా మరేమీ సపోర్ట్ గా రావడం లేదు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. కాని కొన్ని పల్స్ మాత్రం జగన్ కు రాయలసీమ మినహా మరే ప్రాంతంలో విజయం రాదు అని చెబుతున్నాయి. అయితే ఓవరాల్ గా 120 సీట్లు వస్తాయి అని చెబుతున్నారు..

మరి ఇలాంటి సమయంలో జగన్ కు పెద్ద ఎత్తున సర్వేలు కూడా పాజిటీవ్ గా రావడంతో, ఇదే అంశం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా జాతీయ మీడియా ఒకటి జగన్ పై వార్త ప్రసారం చేసింది.. జగన్ ఏపీలో అధికారంలోకి రాబోతున్నారు అని, అయితే చాలా వరకూ జగన్ కు ప్రజలు పట్టంకట్టేది తెలుగుదేశం పై వ్యతిరేకత రావడం అలాగే తర్వాత ప్రత్యామ్నాయంగా జగన్ మాత్రమే వారికి కనిపిస్తున్నారు అని ఆ మీడియా వార్త ప్రసారం చేసింది. దీంతో తెలుగుదేశం నేతలు కూడా షాక్ అయ్యారు …జాతీయ మీడియాలు సర్వేలు చేయకుండా జాతి మీడియాలలా వార్తలు రాయవు అని అంటున్నారు వైసీపీ నేతలు.