Devara | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు అంతే.. ‘దేవర’ గ్లింప్స్ మామూలుగా లేదుగా..

-

RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర(Devara)’ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

- Advertisement -

ఇంగ్లీష్ లిరిక్స్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ముగుస్తుంది. “ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు” అంటూ తారక్ చెప్పై డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక అనిరుథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్ అనే చెప్పాలి. మొత్తానికి తారక్ ఫ్యాన్స్‌కు వారం రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చేసింది.

ఎన్టీఆర్(NTR)- కొరటాల(Koratala Siva) కలయికలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరి కాంబోలో ‘దేవర(Devara)’ రానుండడంతో మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్(Saif Ali Khan) విలన్‌గా, తారక్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న మూవీ ఫస్ట్ పార్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే వార్-2 మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇందులో హృతిక్ రోషన్‌కు విలన్‌గా తారక్ నటించనుండడం విశేషం.

Read Also: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లొకేషన్ ఫిక్స్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...