పాన్ ఇండియా స్టార్స్, మన తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun) మధ్య ట్విట్టర్ లో జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శనివారం అల్లు అర్జున్ 41వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే బావ’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు.
దీంతో ‘థ్యాంక్యూ బావ.. నీకు నా హగ్స్’ అని బన్నీ రిప్లై ఇచ్చాడు. మళ్లీ ఈ ట్వీట్ కి ఎన్టీఆర్ స్పందిస్తూ ‘ఓన్లీ హగ్సేనా బావ.. పార్టీ లేదా పుష్ప’ అంటూ సరదాగా అడిగాడు. దీనికి ఎన్టీఆర్30 మూవీలోని తారక్ డైలాగ్ తో ‘వస్తున్నా’ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరు తమ సినిమాల్లోని డైలాగ్స్ ను ఉపయోగిస్తూ సరదాగా సంభాషించుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వీరి చాటింగ్ తో బావ అనే పదం ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. కాగా బన్నీ పుష్ప2తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్(NTR) కొరటాల ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.
Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !!
— Jr NTR (@tarak9999) April 8, 2023
Read Also: బ్యూటీ కేర్ తప్పనిసరి.. అక్కినేని అఖిల్
Follow us on: Google News, Koo, Twitter