సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న చిత్రం జైలర్(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన తమన్నా లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం జైలర్ ఫస్ట్ సింగిల్ కావాలా సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. తమన్నా(Tamannaah) హాట్ హాట్ స్టెప్పులతో మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని తాజా సాంగ్ చెబుతోంది. తమన్నాతో తలైవా కూడా స్టైలిష్ స్టెప్పులేసి అదరగొట్టేయబోతున్నాడని లిరికల్ వీడియో సాంగ్‌తో అర్థమవుతోంది. జైలర్(Jailer) మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే జైలర్ నుంచి మేకర్స్ విడుదల చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నా లుక్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Read Also:
1. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ అప్‌డేట్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat