‘క‌చ్చా బాదామ్’ సింగర్ నోట మరో పాట (వీడియో)

'Kaichcha Badam' Singer Nota Another Song (Video)

0
97

పల్లిలు అమ్ముకునే వ్య‌క్తి ఒక పాట‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. అత‌నే భూబ‌న్. క‌చ్చా బాదామ్ అనే పాట‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీనితో అతను ఒక పెద్ద సెల‌బ్రెటీ అయిపోయాడు. స్టార్ డ‌మ్ రావ‌డంతో సెకండ్ హాండ్ లో ఒక కారు తీసుకున్నాడు భూబ‌న్.

అయితే భూబ‌న్ కు డ్రైవింగ్ రాక‌పోవ‌డంతో నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో భూబ‌న్ కారు నడుపుతుండగా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో భూబ‌న్ ఛాతిలో బ‌ల‌మైన గాయం అయింది. దీనితో అతను ఆసుపత్రిలో చేరాడు. ప్ర‌స్తుతం భూబ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉండగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయ్యాడు.

అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే కారు యాక్సిడెంట్‌ మీదనే భుజన్‌ మరో పాట అందుకున్నారు. అమర్‌ నోటున్‌ గారి ”నా కొత్త కారు” అంటూ భుజన్‌ పాడిన పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కచ్చా బాదమ్‌ ఫీవర్‌ పోకముందే మరో పాటను భుజన్‌ పాడటంతో నెటిజన్లు ఫుల్‌ ఫిదా అవుతున్నారు. ఆ పాటకు కూడా స్టెప్స్‌ వేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు నెజిజన్లు.

భుజన్‌ పాడిన పాట చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/AshTheWiz