లక్కీ ఛాన్స్ కొట్టేసిన కాజల్

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కాజల్

0
124

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది… వరల్డ్ ఫేమస్ మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా నుంచి ప్లేస్ సాధించిన మూడవ సెలబ్రెటీగా రికార్డ్ కు ఎక్కింది ఈ ముద్దుగుమ్మ…

సౌత్ ఇండియాలో ఎవ్వరికి దక్కని అవకాశం ఈ సారి కాజల్ కు దక్కింది… సింగపూర్ లోని మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనను బొమ్మను తానే స్వయంగా ఓపేన్ చేసింది ఈ ముద్దుగుమ్మ… గత సంవత్సరం ఆమె దగ్గర కొలతలు తీసుకున్నప్పుడే సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో చెప్పింది కాజల్…

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఫేమస్ అయిన వారి మైనపు బొమ్మలను మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారు… ఇప్పటివరకు మేడమ్ టూస్సాడ్స్ లో బాహుబలి ప్రభాస్, లాస్ట్ ఇయర్ మహేష్ బాబు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు కాజల్ కు ఈ అవకాశం వరించింది…