లోకేష్ కి షాకిచ్చిన జగన్ సర్కార్

లోకేష్ కి షాకిచ్చిన జగన్ సర్కార్

0
80

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారాలోకేష్ టీడీపీ తరపున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రత తగ్గించారు.

తాజాగా మరోసారి ప్రభుత్వం షాక్ ఇచ్చింది, ఆయనకు కల్పిస్తున్న వై ప్లస్ భద్రత కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… వై ప్లస్ కేటగిరీ కింద లోకేశ్ కు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. అయితే ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఆ భద్రత 1 ప్లస్ 1కు తగ్గిపోనుంది.

అయితే దీనిపై టీడీపీ నేతలు ఇలా భద్రత తగ్గించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 4 ప్లస్ 4 గా భద్రత ఉండేది, తర్వాత మావోల దాడి ఉత్తరాంధ్రాలో జరగడంతో ఆయనకు జడ్ కేటగిరి భద్రత కల్పించారు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రత 2+2 చేశారు మళ్లీ దీనిని1+1 కి తగ్గించారు.