కాజల్ మళ్ళీ గేర్ మార్చింది..మళ్ళీ ఐటెం గా..!!

కాజల్ మళ్ళీ గేర్ మార్చింది..మళ్ళీ ఐటెం గా..!!

0
36

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ సినిమా, ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాదులో రెండవ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నారు.

ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ వుండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. ఈ ప్రత్యేక గీతం కోసం కాజల్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్’ అంటూ కాజల్ చేసిన సందడి అంతాఇంతా కాదు. అలాంటి కాజల్ అంతకుమించిన రేంజ్ లో బన్నీతో కలిసి దుమ్ము రేపేస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారనే టాక్ వినిపిస్తోంది.