భర్త కోసం కాజల్ కీలక నిర్ణయం..అదేంటంటే?

Kajal's key decision for husband..is that?

0
114

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు కాజల్ అగర్వాల్. సుధీర్ఘకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో అగ్ర కథనాయికగా దూసుకుపోతుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‍గా ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ ప్రస్తుతం చిరంజీవితో కలిసి ఆచార్య మూవీ చేస్తుంది.

అయితే గత కొద్ది కాలంగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాజల్ సినిమాల నుంచి తప్పుకుంటుందని నెట్టింట్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకున్న..తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి బయటకు వచ్చినట్లుగా సమాచారం.

అయితే ఈ క్రమంలోనే కాజల్ తన భర్త కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తన భర్త గౌతమ్ కిచ్లును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తోందట. తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు.. తన భర్త గౌతమ్ కిచ్లుకు ఒక రోల్ ఇవ్వాలని అడుగుతుందట. పాత్ర చిన్నదైన సరే కానీ కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందట. గౌతమ్ కు నటనపై ఇంట్రెస్ట్ ఉందని దీంతో కాజల్..తనను నటుడిగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.