కమలహాసన్ చేసిన ఆ సినిమానే చాలా తెలుగు సినిమాలకి మూలం ..

కమలహాసన్ చేసిన ఆ సినిమానే చాలా తెలుగు సినిమాలకి మూలం ..

0
92

తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ కళాతపస్వి కే.విశ్వనాధ్ తో తీసిన స్వాతిముత్యం ,సాగర సంగమం చిత్రాలు అప్పట్లో ఎంత సంచలనం సృష్ట్టించాయో అందరికి తెలిసిన విషయమే .. అయితే ఇలాంటి జోనర్ కి పూర్తి బిన్నంగా అయన మణిరత్నం తో కలిసి అయన చేసిన నాయకుడు అనే సినిమా మీలో ఎంత మంది చూసారో నాకైతే తెలీదు కానీ చూడక పోతే మాత్రం వెంటనే చూసెయ్యండి .

లీడర్షిప్ అనే అంశాన్ని జనాల్లోకి పూర్తిగా తీసుకెళ్లిన సినిమా నాయకుడు . ఎంట్రీ సీన్ నుంచి క్లయిమాక్స్ వరకు ఎక్కడ అనవసరమైన ఎలివేషన్ లు లేకుండా వెళ్తుంటుంది ఈ మూవీ .. ఇందులో కమల హాసన్ కి అయన కూతురికి మధ్య వచ్చే ఒక సీన్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే ..

శ్రామికుల నాయకుడిగా కమల్ నటన కు నీరాజనాలు పట్టారు అప్పటి అయన అభిమానులు . ఈ సినిమా తర్వాత చాల సినిమాలకి మూలం ఈ సినిమా కథ నుండే తీసుకున్నట్టు చాల మంది చెబుతారు . మీరు ఏదైనా ఓ మంచి సినిమా చూడాలనుకుంటే వెంటనే నాయకుడు చూసెయ్యండి .