తమిళనాడులో రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి, ఈ సారి జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి అనే చెప్పాలి, ఎందుకు అంటే ఈసారి ఇక్కడ కమల్ హాసన్ కొత్త పార్టీ, అలాగే రజనీకాంత్ కొత్త పార్టీ కూడా ప్రజల్లోకి వస్తున్నాయి, వీటితో పాటు ఏనాటి నుంచో ఉన్న అధికార ప్రతిపక్ష అన్నాడీఎంకే డీఎంకేతో పాటు.
జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ కూడా పోటీ పడుతున్నాయి, ఇక మరో నాలుగు చిన్న పార్టీలు కూడా తమ ప్రభావం చూపించనున్నాయి, ఈ సమయంలో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి, ఈ సమయంలో బీజేపీ మాత్రం దూకుడు పెంచింది అనే చెప్పాలి.. ఇక్కడ తన బలం పెంచుకుంటోంది బీజేపీ.
తాజాగా కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. కమల్ పార్టీకి చెందిన సీనియర్ నేత అరుణాచలం ఈరోజు బీజేపీలో చేరారు.మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కమలం గూటికి చేరారు..కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.