ఆ సినిమా చూసి కంటతడి పెట్టిన RRR సృష్టికర్త

-

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కంగనానే కథ రాసుకొని దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ సినిమా కోసం కంగనా(Kangana Ranaut) చాలా కష్ట పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫైనల్ ఎడిటింగ్ అవుట్ పుట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే ఆ అవుట్‌పుట్‌ని కంగనా మొదటగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌(Vijayendra Prasad )కు చూపించిదట. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆ సినిమా చూస్తునంతసేపు విజయేంద్ర ప్రసాద్ చాలాసార్లు కళ్ళు తుడుచుకున్నారని చెప్పుకొచ్చింది. సినిమా మొత్తం చూశాక.. “నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి” అంటూ ప్రశంసించారని పేర్కొంది. ఆ మాటలు నా జీవితంలో మర్చిపోలేనని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...