కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు..విచారణ చేపట్టాలని డిమాండ్

0
80

శివ శక్తి ఫౌండేషన్ సంస్థ అనే పేరుతో పలువురు హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. శివ శక్తి ఫౌండేషన్ సంస్థలో ఆర్ధిక లావాదేవీలను ప్రశ్నించినందుకు తమపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెదిరింపు కాల్స్ చెస్తున్నారని ఆరోపించారు.

2017లో కరుణాకర్ సుగుణ అధ్యక్షుడిగా శివ శక్తి ఆధ్యాత్మిక ఫౌండేషన్ ఏర్పాటు చేశారన్నారు. పాస్టర్ తో కుమ్మైకై ఉపాధ్యక్షుడు పివి సతీష్, సభ్యులు విజయ్ కుమార్, శ్రీనివాస రాజు మరో ఇద్దరిని ఫోర్జరీ సంతకాల ద్వారా యాజమాన్యం నుంచి తప్పించారని ఆరోపించారు. చీకటి ఒప్పందం చేసుకొని హిందువుల వద్ద ఫౌండేషన్, సొసైటీలకు రెండు సార్లు గత ఏడాది ఈ ఏడాది ఫండ్స్ వసూలు చేసారని తెలిపారు.

ఈ విషయమై తానూ నిలదీసి సిసిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సొంత కుటుంబ అప్పులు తీర్చడానికి లాభాపేక్ష లేని సంస్థ నుంచి విరాళాలు సేకరిస్తున్నారని ఆరోపించారు. హిందు బంధువులు ఎవరైనా శివ శక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివ శక్తి ఫౌండేషన్ లకు దయచేసి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని వేడుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు పలు సెక్షన్ల తో ఎ1 గా కరుణాకర్ సుగుణ, ఎ2 గా దేవిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి, ఎ3 గా సునీత రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. డొనేషన్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించినందుకే…తనపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. తక్షణమే వారి డొనేషన్ల వసూళ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.