కరోనా వైరస్ కి వార్నింగ్ ఇచ్చిన వర్మ

కరోనా వైరస్ కి వార్నింగ్ ఇచ్చిన వర్మ

0
90

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి, ఆయన మాట ఆయన సినిమా ఆయన బాటా చాలా మందికి నచ్చుతుంది.. అందుకే ఆయనని అభిమానించే వారు చాలా మంది ఉంటారు, అయితే ఆయన దిశ ఘటనపై ఓ సినిమాని తీస్తున్నారు, ఈ సమయంలో దేశంలో జరిగే విషయాలపై కూడా అప్పుడప్పుడూ స్పందిస్తూ ఉండే వర్మ

తాజాగా కరోనా వైరస్ గురించి కూడా స్పందించారు.ఈసారి వైరస్ ను టార్గెట్ చేశారు.డియర్ కరోనా వైరస్… మూగదానిలా అందరినీ చంపుకుంటూ వెళ్లేబదులు ఒక విషయం గురించి తెలుసుకో. నీవు ఒక పరాన్నజీవివి. మాతోపాటే నీవు కూడా చస్తావ్. నీవు నా మాటలను నమ్మకపోతే… వైరాలజీలో ఒక క్రాష్ కోర్సు తీసుకో. నీకు నా విన్నపం ఏమిటంటే… బతుకు, బతికించు. నీకు జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

అయితే వర్మ సటైరిక్ గా వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది… వర్మ అభిమానులు మాత్రం రాజుగారు భలే చెప్పారు అని వర్మ స్టైల్ ని ఆయన రాతని మెచ్చుకుంటున్నారు, మరికొందరు కొత్త ప్రాజెక్ట్ ఏమిటి సార్ అని అడుగుతున్నారు, మరికొందరు దీనిపై సినిమా ప్లాన్ చేయండని చెబుతున్నారు.