100 కోట్ల దిశగా కార్తికేయ-2..నిఖిల్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్

0
92

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా కార్తికేయ 2ను రూపొందించారు.

ద్వారక రహస్యాన్ని చేధించే కథాంశంతో తెరెకక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​ గా నటించింది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయింది. కార్తికేయ 2 బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోందట. రోజు రోజుకూ.. థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో.. కలెక్షన్స్ గ్రాఫ్ పరుగెడుతోందట.

ఈ చిత్రం ఇప్పటివరకు 75 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. 100 కోట్ల రూపాయల క్లబ్ వైపుకి దూసుకుపోతుంది. అయితే ఆగస్టు 25న లైగర్ విడుదల కానుండగా, ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. మరి ఈ రెండు రోజుల్లో కలెక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.