కార్తీక దీపం సీరియల్ ఇంకా ఎన్ని రోజులంటే – నిర్మాత క్లారిటీ

కార్తీక దీపం సీరియల్ ఇంకా ఎన్ని రోజులంటే - నిర్మాత క్లారిటీ

0
85

బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్సో తెలిసిందే.. సరికొత్త టీఆర్పీలతో దూసుకుపోతోంది..

ఈ సీరియల్ మార్చి 30 నాటితో 1000 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని బుల్లితెరపై రికార్డు క్రియేట్ చేసింది,

ఈ సీరియల్ కు రెండు తెలుగు స్టేట్స్ లో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.

 

13-18 కంటే తక్కువగా కాకుండా టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటోంది..

మలయాళం కరుతముత్తూ సీరియల్ ఆధారంగా ఈ సీరియల్ రూపొందింది. 2017 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. కన్నడలో ముద్దులక్ష్మి, తమిళ్లో భారతి కనమ్మ, మరాఠీలో రంగ్ మాజ వేగల పేరుతో ఈ సీరియల్ ప్రసారం అవుతోంది.

 

ఇక ఈ సీరియల్ క్లైమాక్స్ కి చేరింది అని వార్తలు వినిపించాయి… కొద్ది రోజులుగా ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వంటలక్క ఈ సీరియల్ ఎప్పుడు అవుతుంది అని నిర్మాతని సరదాగా అడిగింది. కార్తీకదీపం 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత గుత్తా వెంకటేశ్వరావుతో మాట్లాడారు…

 

అష్టాచెమ్మ సీరియల్ 1357 ఎపిసోడ్లు పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేసింది.. ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ దాన్ని బీట్ చేస్తుంది.. ఖచ్చితంగా 2000 ఎపిసోడ్లను పూర్తి చేస్తుంది.మరో మూడు నాలుగేళ్లు ఈ సీరియల్ నడవచ్చు అని తెలిపారు. మొత్తానికి ఈ సీరియల్ ఇప్పట్లో ఆగే ప్రసక్త లేదు అంటున్నారు చాలా మంది.

 

.