కె.రాఘవేంద్రరావు ఈ పేరు వినగానే నాడు సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే అంటారు ఎవరైనా… భక్తిరస చిత్రాలకు కూడా ఆయన పెట్టింది పేరు, ఇక ఎన్టీఆర్ తో అనేక హిట్ సినిమాలు అందించారు, నేటి దర్శకులకి కూడా ఆయన రోల్ మోడల్, ఇక కమర్షియల్ హిట్ సినిమాలు అంటే అప్పట్లో కేరాఘవేంద్రరావు పేరు వినిపించేది.
అన్నమయ్య శ్రీరామదాసు ఇలాంటి భక్తిరస ప్రధాన చిత్రాలను కూడా రూపొందించి మంచి పేరు సంపాదించారు ఆయన, ఇక ఆయన కథానాయకుడిగా చాలా మందిని తెరపై చూపించారు.. కాని నేడు ఆయనని కథానాయకుడిగా చూడబోతున్నాం, 78 ఏళ్ల వయసులో ఇప్పుడు ఆయన సినిమాలో చేస్తున్నారు కథానాయకుడిగా.
తనికెళ్ల భరణి దర్శకత్వం వహించే ఓ చిత్రంలో రాఘవేంద్రరావు కథానాయకుడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన విశ్రాంత ఉద్యోగి గా కనిపిస్తారట. ఇక తాజాగా ఈ సినిమాలో ఆయన భార్యగా
నటి రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది. ఇక మరో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అని తెలుస్తోంది బాణీలు కీరవాణి అందించనున్నారు.