ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం కెజిఎఫ్ 2. ఇప్పటికే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్ చేసింది కేజీఎఫ్ -1. అయితే కెజిఎఫ్ 2 సినిమా ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. దీని కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
అయితే సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయముపై సీఎం జగన్ ను కలవడానికి అమరావతికి వెళ్లారు కేజిఎఫ్ 2 చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, ట్రయిలర్ లు సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. కెజిఫ్ పార్ట్ 1 లాగా పార్ట్ 2 కలెక్టన్ల వర్షం కురిపిస్తుందో చూడాలంటే ఇంకా కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.