కాజల్ కు పిలిచిమరీ గుడ్ న్యూస్ చెప్పనున్న చిరంజీవి

కాజల్ కు పిలిచిమరీ గుడ్ న్యూస్ చెప్పనున్న చిరంజీవి

0
96

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య.. ఈ సినిమాలో ముందు నుంచి హీరోయిన్ విషయంలో చాలా పేర్లు వినిపించాయి.. అయితే చివరకు త్రిషని ఫైనల్ చేశారు.. కాని తాజాగా వచ్చే వారం ఆమెతో షూటింగ్ మొదలు పెడుతాం అని అనుకునే సమయానికి, ఆమె సినిమా నుంచి తప్పుకుంటున్నాను అని తెలిపింది , అయితే చిత్ర యూనిట్ కు ఆమెకి కొన్ని విషయాలలో బేధాభిప్రాయాలు వచ్చాయి అని అంటున్నారు.

అయితే ఇలా మధ్యలో ఆమె వదిలి వెళ్లిపోవడంతో చిరు కి కూడా చాలా కోపం వచ్చిందట.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో త్రిషని పిలిచి అవకాశం ఇస్తే ఇలా చేయడం ఏమిటి అని కొరటాల కూడా బాధపడ్డారు, అయితే మరో నటిని తీసుకోవాలి అని చూస్తున్నారు .ఈ సమయంలో చిరు సరసన కాజల్ అయితే బెటర్ అని చెబుతున్నారట.

ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమెతో చిత్ర యూనిట్ చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. తదుపరి షెడ్యూల్ షూటింగుకి కాజల్ హాజరు కానుందని చెబుతున్నారు…గతంలో చిరు కాజల్ ఖైదీనంబర్ 150 చిత్రం చేసిన విషయం తెలిసిందే.. అది సక్సెస్ అయింది … ఇప్పుడు ఈ సినిమా మరో సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు