కాజల్ వివాహం అతనితోనేనా ఫిక్స్ అయిందా?

కాజల్ వివాహం అతనితోనేనా ఫిక్స్ అయిందా?

0
94

టాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు, అయితే పెళ్లి విషయం ఎత్తితే మాత్రం ఏ విషయం చెప్పకుండా దాటవేస్తూ ఉంటారు, అయితే తాజాగా ఇందులో అనుష్క కాజల్ వీరిద్దరి పెళ్లి గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి, తాజాగా ఇప్పుడు కాజల్ గురించి ఆమె పెళ్లి వార్త వినిపిస్తోంది.

ఈ అమ్మడు కొన్నిరోజులు సినిమాలకు బ్రేక్ పడొచ్చు అంటున్నారు నెటిజన్లు. ఔరంగాబాద్కు చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతోందని, సినిమాలు కూడా ఆపకుండా వివాహం తర్వాత కూడా రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూ చేస్తుంది అని అంటున్నారు.

మొత్తానికి కుటుంబ సభ్యులు ఒకే చేసిన పెళ్లి సంబంధం అని తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి.. దీనిపై ఆమె స్పందించారు, మరి తాజాగా ఈ వివాహం గురించి ఎక్కడా ఆమె స్పందించలేదు, ఇలా కాజల్ వివాహానికి సిద్దమవుతున్న వార్త మాత్రం ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతుంది… త్వరలో అధికారికంగా తన పెళ్లి విషయం చెప్పనున్నది అని సినీ వర్గాలు చెబుతున్నాయి.