జూలై 1 నుంచి బ్యాంకుల్లో ఈ కొత్త రూల్స్

జూలై 1 నుంచి బ్యాంకుల్లో ఈ కొత్త రూల్స్

0
41

బ్యాంకు అకౌంట్ ఉందా అయితే మీరు కచ్చితంగా ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి, అంతేకాదు ప్రతీ ఒక్కరికి ఇవి ముఖ్యమైన విషయాలే. జూలై నెల నుంచి బ్యాంక్కు సంబంధించిన పలు అంశాలు మారబోతున్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్పై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇది జూలై ఒకటి నుంచి అన్నీ పీఎన్ బీ బ్యాంకుల్లో కస్టమర్లకు అమలు అవుతుంది. ఇక ఖాతాదారులకు గరిష్టంగా 3.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

ఇక ఇప్పటి వరకూ దేశంలో వైరస్ లాక్ డౌన్ తో ఏటీఎం క్యాష్ విత్డ్రాపై చార్జీలు తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వచ్చే నెల నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇప్పటికే మూడు నెలలు ప్రకటించారు ఇది ముగుస్తుంది ఈ నెలతో.

బ్యాంక్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా మూడు నెలలు మాత్రమే తాజాగా ఇది కూడా అమల అవుతుంది జూలై 1 నుంచి.