ఈ యువకుడు కరోనా రోగులకు ఏం చేస్తున్నాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు.

ఈ యువకుడు కరోనా రోగులకు ఏం చేస్తున్నాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు.

0
32

ఈ వైరస్ తో పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది మన దేశం.. మూడు నెలలుగా చాలా మందికి ఉపాధి లేదు ..వైరస్ సోకిన వారికి చికిత్స ప్రభుత్వం అందిస్తోంది, వైద్యులు ఇందులో సర్వీస్ చేస్తున్నారు, అయితే ఓ వ్యక్తి ఈ సమయంలో బాధపడుతున్న వారి బాధలు చూసి చలించిపోయాడు మానవత్వంతో తనకు తోచిన సాయం చేశాడు.

షెహన్వాజ్ అనే వ్యక్తి తన మిత్రుడు అబ్బాస్ రిజ్వీతో కలిసి ఓ ఎన్జిఓ ను నడుపుతున్నాడు. ఇటీవల షెహన్వాజ్ తన మిత్రుడి సోదరి కరోనా తో మరణించడాన్ని చూసి చలించి పోయాడు. ఆమె గర్భవతి పాపం కరోనాతో మరణించింది, దీంతో అతను ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు అని అనుకున్నాడు.

ఆమెకి ఆక్సిజన్ సిలిండర్ లేక మరణించింది… దీంతో వెంటనే తన దగ్గర ఉన్న తన ఎస్యూవీ కారును అమ్మి ఆక్సిజన్ సిలిండర్లను కొన్నాడు. కారు అమ్మిన డబ్బుతో మొత్తం 60 ఆక్సిజన్ సిలిండర్లను కొన్నాడు. మరో 40 ఆక్సిజన్ సిలిండర్లను అద్దెకు తీసుకున్నాడు. వీటిని ఇంట్లో ఉండి కరోనాకు చికిత్స పొందుతున్న వారికి అందించాడు, అతను చేసిన పనికి డాక్టర్లు కూడా శభాష్ అంటున్నారు.