ఆర్జీవీ సంచలనం..తెలంగాణ రక్తచరిత్రగా “కొండా” బయోపిక్

0
99

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు.

విప్లవం అనేది ఎప్పటికీ ఆగడు. దాని రూపు మార్చుకుంటుంది అంతే. ‘కొండా’ సినిమా చిత్రీకరణ వరంగల్, పరిసర ప్రాంతాల అడవుల్లో జరగనుంది. మా చిత్ర విప్లవం అతి త్వరలో మొదలవబోతుంది అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

కొండా దంపతుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వర్మ కొద్ది రోజుల క్రితం వరంగల్‌ పరిసరాల్లోనే పర్యటించారు. తాజాగా ఆయన కొండా దంపతులు చదివిన లాల్‌బహదూర్‌ కాలేజీకి వెళ్లి అక్కడి లెక్చరర్స్‌తో మాట్లాడారు.

ఈ సినిమాలో కొండా మురళి, సురేఖ పాత్రల్లో యంగ్ హీరో అదితి అరుణ్, హెరాయిన్ ఇరా మోర్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.