హుజురాబాద్: టీఆర్ఎస్ కు షాక్..ఏకంగా 1000 మంది నామినేషన్లు!

0
44

తెలంగాణ: హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రేపుతోంది. అధికార, విపక్ష పార్టీలతో పాటు వివిధ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధి హామీ సహాయకులు సైతం భారీగా  నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించేందుకు వైఎస్సార్‌టీవీ సన్నాహాలు చేస్తుండగా, తమ ఉద్యోగాలకు ఎసరుపెట్టేలా అసెంబ్లీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉపాధిహామీ ఫథకం క్షేత్ర సహాయకులు 1000 మంది నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు. దీనితో అధికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..వెయ్యి మంది క్షేత్ర సహాయకులతో నామినేషన్లు వేయిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య తెలిపారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పని చేస్తామని శ్యామలయ్య హెచ్చరించారు.