కొట్లాడుకుందాం అంటే ఎక్కడికైనా ఎందాకైనా రావడానికి నేను రెడీ – మోహన్ బాబు

కొట్లాడుకుందాం అంటే ఎక్కడికైనా ఎందాకైనా రావడానికి నేను రెడీ - మోహన్ బాబు

0
94

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో ఇటీవలే మా డైరీ 2020 ఆవిష్కరణ జరిగింది… ఈ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా చిరంజీవి అలాగే మోహన్ బాబు, కృష్ణంరాజులు హాజరు అయ్యారు… ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మా అసోషియేషన్ సభ్యుల మధ్య విభేదాలతో ప్రభుత్వ సహాయ సహకారాలు ఆగిపోయాయని అన్నారు… ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సర్దుకుపోవాలని అన్నారు….

దీనిపై రాజశేఖర్ స్పందించారు… తనను మంచి పనులు చేయకుండా తొక్కెస్తున్నారని అన్నారు… తాము చిన్న పిల్లలం కాదని అసలు మా అసోషియేషన్ లో ఎందుకు గొడవలు జరిగాయే బయటపెట్టాని అన్నారు… దీంతో రాజశేఖర్ పై చిరు మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే…ఈ నేపథ్యంలో మోహన్ బాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

నిజానికి రాజశేఖర్ తో తనకు మంచి అనుభంధం ఉదని అయితే ఆ విధంగా అందని ముందు మాట్లాడడం మాత్రం సరైనది కాదరి అన్నారు… ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎందరో నటులు అసోసియేషన్ అభివృద్దికి తమ వంతు సహాయం చేస్తున్నారని గుర్తు చేశారు…

అందులో భాగంగానే తాను చిరంజీవి తమవంతు సహాయం చేశామని అన్నారు… ఎవరి సినిమాల గురించి తప్పుగా మాట్లాడినా నటుల గురించి మాట్లాడినా సహించేవాడిని కానని అలా మాట్లాడితే తాను ఎంతటి గొడవకైనా సిద్దం అని కొట్లాడుకుందాం అంటే ఎక్కడికి అయినా ఎందాకైనా రావడానికి నేను రెడీ అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు…