కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన కాజల్

కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన కాజల్

0
92

కాజల్ ఇటీవల తన మిత్రుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది ముంబైలో వీరి వివాహం జరిగింది, ఇక త్వరలో ఆమె సినిమా పరిశ్రమకు చెందిన వారికి ఓ పార్టీ కూడా ఇవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే కాజల్ కు సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండేవి కాని ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి, అయితే చేసేవి కొన్ని ప్రాజెక్టులు అయినా అన్నీ పెద్ద ప్రాజెక్టులు చేస్తోంది.

తాజాగా కాజల్ ఇటు వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది.. అలాగే ఆమె బిజినెస్ విమెన్ గా మారింది అంటున్నారు చాలా మంది… దానికి కారణం ఏమిటి అంటే ఓకీ అనే గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టింది కాజల్. ఈ కంపెనీలో 15 శాతం వాటా కొనుగోలు చేసి, బోర్డ్ మెంబర్గా చోటు సంపాదించింది.

ఇక పెళ్లి తర్వాత ఒకవేళ సినిమాలు చేస్తాను అని చెప్పింది అయితే అవకాశాలు వస్తే ఒకే ఒకవేళ తనకు అవకాశాలు రాకపోయినా ఫ్యూచర్ లో మంచి వ్యాపారవేత్తగా ఉండాలి అని ప్లాన్ చేస్తోంది అంటున్నారు అభిమానులు, మొత్తానికి ఆమె చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే .