SBI ఏటీఎం పిన్ మర్చిపోయారా ఇలా చేయండి ఈజీగా జనరేట్ అవుతుంది

SBI ఏటీఎం పిన్ మర్చిపోయారా ఇలా చేయండి ఈజీగా జనరేట్ అవుతుంది

0
37

చాలా మంది నాలుగు ఐదు బ్యాంకు ఖాతాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో వారు ఏటీఎం నెంబర్లు ఓక్కోసారి మర్చిపోతూ ఉంటారు, ఇలాంటి సమయంలో చాలా ఇబ్బంది పడతారు, అయితే ఎస్ బీఐ తాజాగా కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది, ఇలాంటి ఇబ్బంది వస్తే మీరు ఎస్ బీఐ కస్టమర్ అయితే ఇలా చేయండి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్, ఎస్ఎంఎస్ ద్వారా సులువుగా ఏటీఎం పిన్ జనరేట్ చేయొచ్చు.తాజాగా SBI గ్రీన్ పిన్ పేరుతో ప్రచారం చేస్తోంది,. మీరు ఇలా మర్చిపోతే జనరేట్ చేయడానికి ముందుగా ఐవీఆర్ఎస్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలి.

మీరు బ్యాంకులో ఏ ఖాతాకి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాని ద్వారా చేయాలి, తర్వాత మీరు ఏటీఎం డెబిట్ కార్డు సేవల కోసం 2 ప్రెస్ చేయండి, ఇక పిన్ జనరేషన్ కోసం 1 ప్రెస్ చేయాలి, ఇక మీరు మీ నెంబర్ నుంచి చేస్తే 1 నొక్కాలి.

తర్వాత మీ ఏటీఎం కార్డులోని చివరి 5 అంకెల్ని ఎంటర్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఐదు అంకెల్ని కన్ఫామ్ చేసేందుకు 1 ప్రెస్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి ఇక తర్వాత మీ నెంబర్ కు మొబైల్ కు మెసేజ్ వస్తుంది సో ఈజీగా మీరు పిన్ జనరేట్ చేసుకోవచ్చు.