కొత్త విషయం చెప్పిన ప్రభాస్

కొత్త విషయం చెప్పిన ప్రభాస్

0
112

జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ అన్ టైటిల్ చిత్రం తెలిసిందే… ఎలాంటి విషయాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కిస్తున్నారు … ప్రభాస్ 20వ సినిమా తదుపరి షెడ్యూల్కి సిద్ధమైంది అని వార్తలు వస్తున్నాయి.. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం కోసం యూరప్ సంబంధిత లొకేషన్స్ కోసం ఓ భారీ సెట్ను అన్నపూర్ణలో సిద్ధం చేశారు. 1960 బ్యాక్డ్రాప్లో యూరప్లో సాగే ప్రేమకథాంశంతో సినిమాను తెరకెక్కుతోంది. దీని కోసం డైరెక్టర్ చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు, అయితే ప్రభాస్ మీడియం బడ్జెట్ అని భావించినా నిర్మాతలు కూడ దీనికి భారీగానే ఖర్చు చేస్తున్నారు.

తన కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందనే విషయాన్ని ప్రభాస్ తెలియజేస్తూ తన ఇన్స్టా అకౌంట్లో ఫొటోను పోస్ట్ చేశారు ప్రభాస్. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్పై సినిమా నిర్మితమవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ మాత్రం సినిమా టైటిల్ పై ఇవ్వలేదు వచ్చే నెల దీనిపై ఓ పోస్టర్ రిలీజ్ చేస్తారు అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.