సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా

సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా

0
139

సంక్రాంతి అంటే చిన్నా పెద్దా అందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తాం కదా.. మరి అసలు ఎందుకు ఇలా పండుగ రోజున గాలి పటాలు ఎగుర వేస్తారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు…దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

అయితే గతంలో చాలా మంది పేపర్లతో కొబ్బరి ఈనులతో గాలి పటాలు తయారు చేసుకునేవారు ..ఇప్పుడు చాలా వరకూ ఇలాంటివి గ్రామాల్లో కనిపిస్తాయి, ఇలా ఇంటి పై గాలి పటాలు ఎగురవేస్తే వారికి స్వాగతం పలికినట్టు చెబుతారు.. అంతేకాదు ఆ ఇంట లక్ష్మీదేవి కొలువు అయి ఉంటుంది అని నమ్ముతారు… అందుకే చాలా మంది ఇళ్లపై గాలి పటాలు ఎగురవేస్తారు.

సో అందుకే కనుమ, ముక్కనుమ, సంక్రంతి, భోగి , ఈ నాలుగు రోజులు మీరు గాలిపటాలు ఎగురవేయవచ్చు.. ఇది ఇంటికి కూడా మంచిదే అని చెబుతున్నారు పెద్దలు, మన దేశంలో సుమారు 16 స్టేట్స్ లో ఇలా సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేస్తారు.