కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల..!!

కౌసల్య కృష్ణమూర్తి టీజర్ విడుదల..!!

0
124

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఈ చిత్రం టీజర్‌ను జూన్‌ 18న మెగాస్టార్‌ చిరంజీవి రిలీజ్‌ చేశారు.

టీజర్ లో మంచి ఎమోషన్ నింపారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడే సగటు పల్లెటూరి ఆడపిల్లగా ఐశ్వర్య రాజేష్ నటన దీనికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. అమాయకత్వం ఆత్మవిశ్వాసం రెండు కలగలిసిన టైటిల్ రోల్ లో ఇట్టే ఒదిగినట్టు కనిపిస్తోంది. ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కౌసల్య తండ్రిగా సింపుల్ గా జీవించేశారు. ప్రత్యేక పాత్రలో శివ కార్తికేయన్ కనువిందు చేశారు. ఝాన్సీ-వెన్నెల కిషోర్-రంగస్థలం మహేష్-విష్ణు-సిఎల్వి నరసింహరావు తదితరులు నటించారు.