అనసూయ జబర్దస్త్ ని వదిలేస్తుందా?

అనసూయ జబర్దస్త్ ని వదిలేస్తుందా?

0
65

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో స్పెషల్ అట్రాక్షన్ యాంకర్ అనసూయనే. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. షో ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆమె ఎన్ని పంచులు విసిరినా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అనసూయను చూసి మురిసిపోతుంటారు బుల్లితెర ప్రేక్షకులు. యాంకర్ అయినప్పటికీ తన అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని మత్తెక్కించడంలో సక్సెస్ అయింది అనసూయ. దీంతో జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్ అనే స్టేజ్ కి వెళ్లిపోయారు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్. అయితే అనసూయ గురించి తాజాగా వినిపిస్తున్న ఓ వార్త వారిని కలవర పెడుతోంది. వివరాల్లోకి పోతే..

ఈ భామకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం ఈమె జబర్ధస్త్‌ ప్రోగ్రాంకు, సినిమాలకు టైమ్ కేటాయించలేకపోతున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇపుడు చేస్తోన్న జబర్థస్త్ ప్రోగ్రాంకు కాస్తంత విరామిచ్చి పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు కేటాయించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి జబర్ధస్త్ పోగ్రాంతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న అనసూయ.. ఇపుడు వరుసగా సినిమా అవకాశాలతో జబర్దస్త్‌కు విరామం ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. మొత్తానికి ఉప్పు లేని పప్పు.. మసాలా లేని కూరల అనసూయ లేని జబర్ధస్త్ ప్రోగ్రాం చూడటం అభిమానులకు కాస్తంత నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి.