ఏపీ ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లలా…వర్మ సెటైర్లు..!!

ఏపీ ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లలా...వర్మ సెటైర్లు..!!

0
48

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషం వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల ముందు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతుగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీసి చంద్రబాబు నాయుడు తీరును తనదైన శైలిలో ప్రజల ముందు ఉంచడంలో దాదాపు సపలీకృతమయ్యాడు వర్మ.

తాజాగా రాము.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేల వైఖరిపై తనదైన శైలిలో వరుస ట్వీట్ లు పెడుతూ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన, స్పీకర్ ల పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేయడానికి స్పీకర్ బెల్ మ్రోగిస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు.